ఒకప్పుడు తెలుగు సినిమా దగ్గర వేసవి సీజన్ వస్తుంది అంటే థియేటర్స్ లో ఓ రేంజ్ సందడి ఉండేది. స్టార్ హీరోల సినిమాలు సహా పలు చిన్న చిన్న సినిమాలు కూడా సాలిడ్ రన్ ని చూసేవి. కానీ ఈ కొన్నాళ్లలో మాత్రం సమీకరణాలు చాలా మారిపోయాయి.ఎంతో పొటెన్షియల్ ఉన్న సీజన్ ని ఎందుకో వేస్ట్ చేస్తున్నారు. మినిమమ్ నోటెడ్ సినిమాలు కూడా లేకుండా తెలుగు బాక్సాఫీస్ చాలా డల్ గా నడుస్తుంది.
గత శుక్రవారం వచ్చిన సినిమాలు కూడా అంతంత మాత్రమే రాణించాయి. ఇక ఈ వారం అయితే ఫ్రైడే మరో డ్రై డే అని చెప్పక తప్పదు. కేవలం ఒక్క తెలుగు సినిమా గేదెల రాజు కాకినాడ తాలూకా అనే సినిమా తప్ప మరో నోటెడ్ సినిమా లేదు. డబ్బింగ్ సినిమాలుగా వాలా 2 ఇంకా మైఖేల్ జాక్సన్ బయోపిక్ సినిమా మైఖేల్ లు విడుదల అవుతున్నాయి. సో ఈ వారం డబ్బింగ్ సినిమాలే డామినేట్ చేసేలా ఉన్నాయి. మరి ఇంతలా వేసవి సీజన్ వేస్ట్ కావడం అనేది ఒకింత ఆశ్చర్యకరమే అని చెప్పాలి.
