‘ఆదర్శ కుటుంబం’ నుంచి మరో ఫన్ రోల్.. ప్రోమో రిలీజ్ చేసిన మేకర్స్!

‘ఆదర్శ కుటుంబం’ నుంచి మరో ఫన్ రోల్.. ప్రోమో రిలీజ్ చేసిన మేకర్స్!

Published on Jul 29, 2026 12:00 PM IST

విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా దర్శకుడు త్రివిక్రమ్ కలయికలో చేస్తున్న అవైటెడ్ చిత్రమే ‘ఆదర్శ కుటుంబం’. రీసెంట్ గానే ఆన్లైన్ లో ఒకొకటిగా ఇంట్రెస్టింగ్ అప్డేట్ లని మేకర్స్ అందించడం స్టార్ట్ చేశారు. ఇలా మొదట వెంకీ మామ తర్వాత శ్రీనిధి శెట్టి ప్రోమోలని విడుదల చేసి మంచి రెస్పాన్స్ అందుకోగా ఇపుడు వీరి ఆదర్శ కుటుంబం నుంచి వెంకీ మామ కూతురు పాత్రని పరిచయం చేశారు.

యువనటి యువిన పార్థవిని వెంకీ మామ కూతురు సంపూర్ణ అంటూ పరిచయం చేసిన ఈ ప్రోమో మంచి ఫన్ గా కనిపిస్తుంది. తండ్రి దగ్గరకి వచ్చి ప్రేమలో పడ్డాను అని చెప్తే ఈసారి ఎవరు కార్ మెకానిక్ తోనా అంటూ అంటూ వెంకీ మామ ఓ ఫ్రెండ్లీ ఫాదర్ రోల్ లో ఇంప్రెస్ చేసేలా కనిపిస్తున్నారు.

ఇలా మొత్తానికి ఈ ఆదర్శ కుటుంబం నుంచి ఒకో రోల్ మంచి ఫన్ ని జెనరేట్ చేస్తూ వస్తున్నాయి. ఇక నెక్స్ట్ వచ్చే రోల్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా హారికా హాసిని వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ అక్టోబర్ 2న సినిమా విడుదల కానుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు