“టిల్లు స్క్వేర్” సీక్వెల్ ఉందా? ఇదే క్లారిటీ

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెండ్ హీరో స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కించిన లేటెస్ట్ సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “టిల్లు స్క్వేర్”. మరి పార్ట్ 1 డీజే టిల్లు కి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా ఆ అంచనాలు రీచ్ అయ్యి అదరగొట్టింది. అయితే రిలీజ్ కి ముందు ఉన్న అనేక అనుమానాల్లో ఈ సినిమాకి కూడా సీక్వెల్ ఉందా లేదా అనేది కూడా ఒకటి.

అయితే ఈ అంశానికి మేకర్స్ టిల్లు స్క్వేర్ తో క్లారిటీ ఇచ్చేసారు. ఫస్ట్ పార్ట్ ఎండింగ్ లో హింట్ ఇచ్చినట్టుగా ఇందులో ఎలాంటి హింట్ లేదు. టిల్లు ఫ్రాంచైజ్ ని అయితే దీనితో ముగించేశారు. సో ఇక టిల్లు నుంచి మరో సినిమా లేనట్టే అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి రామ్ మిర్యాల, అచ్చు సంగీతం అందించగా భీమ్స్ బిజిఎం అందించాడు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ 4 సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

Exit mobile version