గోపీచంద్ “భీమా” హిందీ వెర్షన్.. ఈ ఓటిటి ప్లాట్ ఫామ్ లో

మన టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా మాళవిక శర్మ హీరోయిన్ గా కన్నడ దర్శకుడు ఏ హర్ష తెరకెక్కించిన సాలిడ్ మాస్ అండ్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “భీమా”. డీసెంట్ బజ్ నడుమ వచ్చిన ఈ చిత్రం మాస్ ఆడియెన్స్ ని మెప్పించింది. అయితే థియేటర్స్ లో అనుకున్న రేంజ్ సక్సెస్ కాలేదు కానీ ఈ సినిమా ఓటిటిలో వచ్చాక చూడని ఆడియెన్స్ ని మంచి రెస్పాన్స్ ని అందుకుంటుంది.

అయితే రీసెంట్ గా హాట్ స్టార్ వారు ఈ సినిమాని తెలుగు సహా సౌత్ భాషల్లో రిలీజ్ చేయగా హిందీ వెర్షన్ సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు. అయితే ఇప్పుడు నార్త్ లో భీమా ఏ ఓటిటి ప్లాట్ ఫామ్ లో వస్తుంది అనేది కన్ఫర్మ్ అయ్యింది. భీమా సినిమాని హిందీలో అయితే జీ 5 వారు సొంతం చేసుకున్నారు. అలాగే శాటిలైట్ హక్కులు కూడా జీ సంస్థ వారే తీసుకున్నారు. దీనితో భీమా హిందీలో అయితే వీటిలో వీక్షించవచ్చు. ఇక ఇది హిందీలో ఎప్పుడు వస్తుంది అనేది డేట్ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి రవి బసృర్ సంగీతం అందించగా శ్రీ సత్య ఆర్ట్స్ వారు నిర్మాణం వహించారు.

Exit mobile version