ప్రయోగాన్నే నమ్ముకున్న సుకుమార్ మరొక శిష్యుడు

Sukumar

దర్శకుడు సుకుమార్ తన శిష్య బృందాన్ని బాగా ఎంకరేజ్ చేస్తుంటారు. తన వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన వారికి దర్శకులుగా అవకాశాలు ఇప్పించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంటారు. ఇటీవల కాలంలో సుకుమార్ స్కూల్ నుండి వచ్చిన కొత్త దర్శకుడు బుచ్చిబాబు సాన ‘ఉప్పెన’ సినిమాతో క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. డెబ్యూ హీరోకి రికార్డ్ స్థాయి కలెక్షన్లు వచ్చేలా సినిమా తీసి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు బుచ్చిబాబుతో వర్క్ చేయడానికి పెద్ద దర్శకులు కూడ ఆసక్తి చూపుతున్నారు.

బుచ్చిబాబు సాన సాధించిన విజయంతో సుకుమార్ శిష్యుల అంటే ఇండస్ట్రీలో ఒక నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకం వలన ఇంకొందరు సుకుమార్ అసోసియేట్ దర్శకులకు కూడ అవకాశాలు వస్తున్నాయి. సుకుమార్ వద్ద వర్క్ చేసిన అసోసియేట్ కాశి దర్శకుడు కాబోతున్నాడు. అతను కూడ కొత్త హీరోతోనే సినిమా చేస్తున్నాడు. ఇతను కూడ బుచ్చిబాబు తరహాలోనే కథలో కొత్త తరహా ప్రయోగం ఏదో చేయబోతున్నాడట. అది గనుక క్లిక్ అయితే సినిమా తప్పకుండా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతుందని అంటున్నారు. మరి అతను చేయబోతున్న ఆ ప్రయోగం కథతోనా లేకపోతే పాత్రలతోనా అనేది తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.

Exit mobile version