యన్ టి ఆర్ బయోపిక్ నుండి మరొక సప్రైజ్ !

లెజండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి సందర్భంగా ఈ రోజు యన్ టి ఆర్ బయోపిక్ చిత్రం నుండి ఏ ఎన్ ఆర్ ఫస్ట్ లుక్ ను విడుదలచేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా ఈచిత్రం నుండి మరొక అప్ డేట్ రానుంది. ఈరోజు సాయత్రం 4:07 గంటలకు ఈ సప్రైజ్ ను రివీల్ చేయనున్నారు. బహుశా ఈ సినిమాలోని ఏఎన్ఆర్ గారి పాత్ర కు సంభందించిన టీజర్ ను విడుదలచేస్తారేమో.

ఇక ఈరోజు విడుదలైన ఏ ఎన్ ఆర్ ఫస్ట్ లుక్ కు విశేష స్పందన వస్తుంది. సుమంత్ అచ్చం ఆయనలాగే వున్నాడని కామెంట్స్ వస్తున్నాయి. నందమూరి తారకరామ రావు గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈచిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నాడు. క్రిష్ తెరకెక్కిస్తున్న ఈచిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకులముందుకు రానుంది.