
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల తెరకెక్కిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం “దేవర”. మరి నిన్ననే టైటిల్ సహా ఫస్ట్ లుక్ ని మేకర్స్ రిలీజ్ చేయగా ఈ చిత్రం పై మంచి హైప్ నెలకొనగా ఈ సినిమాలో ఇప్పటికే భారీ తారాగణం లాక్ చేసారు. మరి కొన్నాళ్ల కితమే స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ కూడా జాయిన్ కాగా ఇపుడు మరో సూపర్ టాలెంటెడ్ నటుడు అయితే దేవర క్యాస్టింగ్ లో జాయిన్ అయ్యినట్టుగా తెలుస్తుంది.
మరి ఈ నటుడే రీసెంట్ గా “దసరా” చిత్రంలో కనిపించి మెప్పించిన నటుడు టామ్ చాకో అట. తాను ఈరోజు నుంచే సెట్స్ ఓ జాయిన్ కాగా కొరటాల పలు కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అయితే ఎన్టీఆర్ సహా అనేక మంది పవర్ ఫుల్ నటులు అయితే ఈ చిత్రంలో ఉన్నారని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ సహా యువసుధ ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.