‘ధురంధర్’ పై కాపీ కామెంట్స్.. కోర్టు నోటీసులు పంపిన డైరెక్టర్..!

Dhurandhar-2

బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ‘ధురంధర్: ది రివెంజ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న తరుణంలో ఒక భారీ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా కథ తన ‘డి-సాహెబ్’ స్క్రిప్ట్ నుండి కాపీ కొట్టారని దర్శకుడు సంతోష్ కుమార్ ఆర్‌ఎస్ సంచలన ఆరోపణలు చేశారు. రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలోని కీలక పాత్రలు, సన్నివేశాలు తాను 2023లో రిజిస్టర్ చేసుకున్న కథను పోలి ఉన్నాయని ఆయన వాదిస్తున్నారు.

సంతోష్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఆదిత్య ధర్ లీగల్ టీమ్ తీవ్రంగా స్పందించింది. ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలని, నిరాధారమని కొట్టిపారేస్తూ సంతోష్‌కు లీగల్ నోటీసులు పంపారు. అసత్య ప్రచారాలు మానుకోవాలని, లేదంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అయితే సంతోష్ కుమార్ మాత్రం తన వద్ద స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆధారాలు ఉన్నాయని, నిర్మాతలపై కోర్టులో కేసు వేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు.

ఈ వివాదం నడుస్తున్నప్పటికీ, ‘ధురంధర్ 2’ కలెక్షన్ల సునామీ మాత్రం ఆగడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటికే రూ.1,500 కోట్ల వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. ఒకవైపు సినిమా భారీ విజయాన్ని ఎంజాయ్ చేస్తుంటే, మరోవైపు కాపీ వివాదంతో చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. కథ తనదేనని ఒకరు, కాదు తన ఒరిజినల్ ఐడియా అని మరొకరు వాదిస్తుండటంతో ఈ వివాదం ఎటువైపు దారితీస్తుందో వేచి చూడాలి.

Exit mobile version