రవితేజ నుంచి మరో ట్రీట్ రెడీ అవుతుందా.?

raviteja
ఈ కొత్త ఏడాది తన సినిమాతోనే ఒక అదిరిపోయే శుభారంభాన్ని ఇచ్చి మిగతా సినిమాలకు గట్టి బేస్ ఇచ్చిన మాస్ మహారాజ్ “క్రాక్” తర్వాత చేపట్టిన చిత్రం “ఖిలాడి”. దర్శకుడు రమేష్ వర్మతో ప్లాన్ చేసిన ఈ సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రానికి కూడా అన్ని పనులు శరవేగంగా జరిగిపోతున్నాయి. అంతే కాకుండా మంచి అంచనాలను కూడా ఈ చిత్రం ఏర్పర్చుకుంది.

అయితే ఈ సినిమాకు సంబంధించి అప్డేట్స్ కూడా అప్ టు డేట్ మేకర్స్ వదులుతున్నారు. అలాగే మరో ట్రీట్ ను మేకర్స్ రెడీ చేస్తున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రం తాలూకా టీజర్ ను మేకర్స్ వచ్చే శివరాత్రి సందర్భంగా విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి దీనిలో ఎంత వరకు నిజముందో అధికారిక క్లారిటీ వచ్చే వరకు ఆగాల్సిందే. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా పెన్ స్టూడియోస్ ఏ స్టూడియోస్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version