‘అసుర’ కమర్షియల్ సక్సెస్‌పై నారా రోహిత్ ధీమా!

Nara-Rohith
సినిమా సినిమాకూ కొత్తదనాన్ని చూపిస్తూ వైవిధ్యభరితమైన సినిమాలతో ఆకట్టుకుంటున్న హీరో నారా రోహిత్. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ కొత్త ఐడెంటిటీ ఏర్పరుచుకున్న నారా రోహిత్‍‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అసుర’. గత కొంతకాలంగా ఆయన నటించిన సినిమాలన్నీ విమర్శకుల ప్రశంసలను అందుకోవడమే కాక, సరికొత్త కథాంశాలుగా తెరకెక్కిన సినిమాలుగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. అయితే కమర్షియల్‌గా ఆ సినిమాలు అనుకున్నంత విజయాలను సొంతం చేసుకోలేకపోయాయ్!

ఈ నేపథ్యంలో వస్తోన్న ‘అసుర’ మాత్రం తన స్టైల్లో సాగే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా అని, కచ్చితంగా ఈ సినిమా కమర్షియల్‌గా మంచి విజయం సాధిస్తుందని నారా రోహిత్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రియా బెనర్జీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు నారా రోహిత్ నిర్మాతగానూ వ్యవహరించడం విశేషం.

Exit mobile version