ఒక్క రోజు ఆలస్యంగా వస్తున్న ‘అనుక్షణం’

Anuskhanam
మంచు విష్ణు, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా ‘అనుక్షణం’. మొదట సెప్టెంబర్ 12న విడుదల చేయాలని భావించిన ఈ సినిమాను ఒక్క రోజు ఆలస్యంగా సెప్టెంబర్ 13న విడుదల చేస్తున్నారు.

‘అనుక్షణం’లో మంచు విష్ణు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. వరుసగా హత్యలు చేస్తున్న ఒక సైకో కిల్లర్ ను పోలీసులు ఎలా పట్టుకున్నారు అనే కధాంశంతో సినిమాను రూపొందించారు. నవదీప్, తేజస్వి, మధుశాలిని, రేవతి, బ్రహ్మానందం తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. మలయాళంలో ‘కిల్లర్’ పేరుతో ఈ సినిమా అనువదించారు. అక్కడ కూడా సెప్టెంబర్ 13న విడుదలవుతుంది.

‘అనుక్షణం’ సినిమాను విడుదల చేయడానికి కొత్త పద్దతి(ఆక్షన్)ని ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 6న ఆక్షన్ లో బిడ్ నెగ్గిన వారితో హైదరాబాద్ లో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఆ రోజు సినిమా సెకండ్ ట్రైలర్ చూపించబోతున్నారు.

Exit mobile version