అందాల భామ అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్లో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పరదా’. ఈ సినిమాను దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల డైరెక్ట్ చేస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. దీనికి తోడు ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై అంచనాలను పెంచింది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునే ఎమోషన్‌తో పాటు ఇంట్రెస్టింగ్ కథతో రావడం ఈ సినిమాపై పాజిటివ్ వైబ్ క్రియేట్ చేస్తోంది. ఆచారాల ముసుగులో నలిగిపోతున్న తన గ్రామం నుంచి తప్పించుకున్న ఓ అమ్మాయి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది మనకు ఈ సినిమా కథగా చూపించబోతున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ ప్రయాణంలో ఆమెకు మరో ఇద్దరు మహిళలు తోడు కావడం.. వారి ద్వారా తన నిజమైన జీవితాన్ని ఆమె ఎలా కనుగొంది అనేది ఈ సినిమా ప్లాట్‌గా ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
ఇలాంటి గుడ్ ఫీల్ కాన్సెప్టులకు ప్రేక్షకులు ఎప్పుడూ మంచి మార్కులు వేస్తుంటారు. ఇక ఇలాంటి కథతో అనుపమ పరమేశ్వరన్ మరోసారి తనలోని నటిని మనకు చూపించబోతున్నట్లు స్పష్టమవుతుంది. ఈ సినిమాలో మలయాళ బ్యూటీ దర్శన రాజేంద్రన్, సంగీత ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 22న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
