ప్రస్తుతం టాలీవుడ్‌లో కమర్షియల్ సినిమాల హవా నడుస్తుండటంతో లేడీ ఓరియెంటెడ్ చిత్రాల మార్కెట్ బాగా పడిపోయింది. ఇటీవలే అనుష్క నటించిన భారీ చిత్రం ‘ఘాటీ’ బాక్సాఫీస్ వద్ద కనీస ఓపెనింగ్స్ కూడా రాబట్టలేక దారుణంగా ఫ్లాప్ అయింది. ఈ దెబ్బతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు థియేటర్లలో ఆదరణ కరువైందనే భయాలు నిజమయ్యాయి.
ఇలాంటి టైమ్‌లో స్టార్ బ్యూటీ సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ ఈ వారం విడుదలవుతోంది. గతంలో సమంత-నందిని రెడ్డి కాంబోలో వచ్చిన ‘ఓ బేబీ’ మంచి హిట్ అవ్వడం ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. అయితే ప్రస్తుత బాక్సాఫీస్ ట్రెండ్ నడుమ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
బిజినెస్ విషయానికొస్తే, నాన్-థియేట్రికల్ రైట్స్ రూపంలోనే రూ.30 కోట్లు రాబట్టి ఈ సినిమా సేఫ్ జోన్‌కు వచ్చేసింది. థియేటర్ల నుండి వచ్చే వసూళ్లు అన్నీ బోనస్ కిందే లెక్క. మరి లేడీ ఓరియెంటెడ్ సినిమాతో వస్తున్న సమంత ఎలాంటి ఓపెనింగ్స్ సాధిస్తుందో వేచి చూడాలి.
