
సౌత్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లో ఒకరైన అనుష్క నటించిన హిస్టారికల్ ఫిల్మ్ ‘రుద్రమదేవి’. పలుసార్లు వాయిదా పడిన ఈ సినిమా ఈ సారి అన్ని అడ్డంకులను తొలగించుకొని అక్టోబర్ 9న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. దాంతో ఈ సినిమా జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తాజాగా అనుష్క ‘రుద్రమదేవి కలెక్షన్స్’ అనే జ్యువెల్స్ ని లాంచ్ చేసింది.
నిన్న చెన్నైలోని ఎన్ఎసి జ్యువేల్స్ వారు ‘రుద్రమదేవి కలెక్షన్స్’ అనే జ్యువెల్స్ ని లాంచ్ చేసారు. అందులో భాగంగా రుద్రమదేవిలో అనుష్క వేసుకున్న నగలను ఎగ్జిబిషన్ కి కూడా పెట్టారు. ఈ కార్యక్రమానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించిన ఈ సినిమా ఒకేసారితెలుగు , తమిళ్, మలయాళంతో పాటు హిందీలో కూడా రిలీజ్ కానుంది. హాయ్ టెక్నికల్ వాల్యూస్ తో భారీ సెట్టింగ్స్ తో ఒకేసారి 2డి, 3డిలో రూపొందించిన ఈ సినిమాకి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించాడు.
అనుష్కతో పాటు రానా దగ్గుబాటి, అల్లు అర్జున్, నిత్యా మీనన్, కేథరిన్, కృష్ణంరాజు, హంసానందిని, ప్రకాష్ రాజ్ లు ముఖ్య పాత్రలు పోషించారు.