‘సైజ్ జీరో’తో అందరినీ సర్ప్రైజ్ చేసిన అనుష్క

sixze-zero
సౌత్ ఇండియన్ మోస్ట్ డిమాండింగ్ ఉన్న హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో తమిళ స్టార్ ఆర్య హీరోగా నటించిన సినిమా ‘సైజ్ జీరో’. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కోసం అనుష్క 20 కేజీల బరువు పెరిగిందని ఇది వరకే తెలియజేశాం. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ రోజు సైజ్ జీరో ఫస్ట్ లుక్ ని లాంచ్ చేసారు. ఈ ఫస్ట్ లుక్ లో అనుష్కని చూసిన ప్రతి ఒక్కరూ అవాక్కయ్యారు. బెడ్ మీద ఆర్య – అనుష్క కూర్చొని ఉన్న ఫోటోని రిలీజ్ చేసారు. ఈ ఫోటోలో అనుష్క మరీ బొద్దుగా ఉంది.

ఈ లుక్ లో అనుష్కని చూసిన అభిమానులు మరియు సినిమా లవర్స్ ఏంటి ఇంతలావా అని షాక్ అవుతున్నారు. ఈ షాకింగ్ నుంచి వారు తెరుకోవలన్నా, అనుష్క అంతలావు అవ్వడానికి వెనకున్న కారణం తెలియాలన్నా మనం సినిమా రిలీజ్ అయ్యేంత వరకూ ఆగాలి, అలా కాదు అంటే కనీసం ట్రైలర్ రిలీజ్ అయ్యేంతవరకన్నా ఆగాల్సిందే. ఈ చిత్ర డైరెక్టర్ ప్రకాష్ కోవెలమూడి అందం అనేది సైజ్ లో ఉండదు అనే పాయింట్ ని ఈ సినిమా ద్వారా చెప్పాలనుకుంటున్నాడు. సెప్టెంబర్ 6న కౌలాలాంపూర్ లో గ్రాండ్ గా ఈ సినిమా ఆడియోని రిలీజ్ చేసి, గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు.

పివిపి సినిమాస్ బ్యానర్ లో పరమ్ వి పొట్లూరి నిర్మించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో సోనాల్ చౌహాన్, భరత్, ఊర్వసి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించిన ఈ మూవీకి ప్రకాష్ కోవెలమూడి భార్య అయిన కనిన ధిల్లన్ కథ – స్క్రీన్ ప్లే అందించింది

Exit mobile version