150 అడుగుల ఎత్తులో స్టంట్స్ చేసిన అనుష్క

rudrama-devi
సౌత్ ఇండియాలో ఉన్న టాప్ హీరోయిన్స్ లో ఒకరు మరియు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అనుష్క. అనుష్క గ్లామరస్ గానే కాకుండా రిస్కీ స్టంట్స్ చేయడంలో హీరోలతో పోటీ పడుతుందని చెప్పడంలో ఎలాంటి అనుమానమూ లేదు. ఇప్పటికే అనుష్క చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఆ విషయాన్ని నిరూపించుకుంది. ప్రస్తుతం అనుష్క చేస్తున్న ‘రుద్రమదేవి’ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఈ సినిమా కోసం అనుష్క మరో రేర్ ఫీట్ చేసింది.

అనుష్క రుద్రమదేవి సినిమాలో లేడీ వారియర్ గా కనిపిస్తుంది. ఈ సినిమా కోసం అనుష్క కత్తి యుద్దాలు, గుర్రపు స్వారీలు, పోరాట సన్నివేశాలలో శిక్షణ తీసుకుంది. రుద్రమదేవి సినిమా కోసం మరింత ఎక్కువ రిస్క్ చేసి 150 అడుగుల ఎత్తులో ఓ స్టంట్ ని చేసింది. ఈ స్టంట్ చేయడంలో అనుష్క ఏ మాత్రం భయపడకుండా చేయడం చూసిన ఈ చిత్ర యూనిట్ షాక్ కి గురయ్యారు.

‘రుద్రమదేవి పోరాట సన్నివేశాల్లో హీరోలు చేసే రిస్క్ కంటే ఎక్కువగా అనుష్క రిస్క్ చేసింది. ఏ మాత్రం బెదర కుండా 150 అడుగుల ఎత్తులో వేలాడుతూ రిస్కీ స్టంట్ చేసిందని’ రుద్రమదేవి టీం అంటోంది. రానా ప్రధాన పాత్రలో కనిపిస్తున్న ‘రుద్రమదేవి’కి గుణశేఖర్ డైరెక్టర్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version