
ఇప్పటికీ మన్మధుడిలా కనిపించే కింగ్ నాగార్జున మరియు ముద్దుగా స్వీటీ అని పిలుచుకునే అనుష్క కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి. నాగార్జున – అనుష్కల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అందుకే నాగార్జున అడిగితే తన సినిమాలో అతిధి పాత్రల్లో కనిపించడానికి అనుష్క ఎప్పుడూ ముందుంటుంది. అందులో భాగంగానే నాగార్జున – కార్తీ కాంబినేషన్ లో వస్తున్న ‘ఊపిరి’ సినిమాలో ఓ గెస్ట్ రోల్ చేసింది. ఇది పూర్తి కాగానే నాగార్జున మరో సినిమాలో ఓ స్పెషల్ బిట్ సాంగ్ లో కనిపించడానికి అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
నాగార్జున ద్విపాత్రాభినయంలో కనిపించనున్న సినిమా ‘సోగ్గాడే చిన్ని నాయనా’. ఈ సినిమా మేజర్ షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. ప్రస్తుతం కొన్ని పాచ్ వర్క్ సీన్స్ షూటింగ్ జరుగుతోంది. అలాగే ఈ సినిమాలో ఒక చిన్న స్పెషల్ డాన్స్ బిట్ సాంగ్ ని షూట్ చేయాల్సి ఉంది. ఈ సాంగ్ లో డాన్స్ వేయడానికి అనుష్కని అప్రోచ్ అయితే తను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఆ సాంగ్ ని త్వరలోనే షూట్ చేయడానికి ఈ చిత్ర టీం సన్నాహలు చేస్తోంది. కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా పరిచయం కానున్న సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో రమ్యకృష్ణ, లావణ్య త్రిపాటి హీరోయిన్స్ గా కనిపించనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకి నిర్మాత రాధా మోహన్ కథ, స్క్రీన్ప్లే అందించాడు.