‘పెద్ది’ ట్రైలర్ లాంచ్.. భోపాల్ లోనే ఎందుకు..?

Peddi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రంపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ సినిమా విడుదలకు కేవలం 25 రోజులే సమయం ఉండటంతో, ప్రమోషన్లను హోరెత్తించేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్ లాంచ్‌ను భోపాల్‌లో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే, ‘పెద్ది’ ఈవెంట్‌ను భోపాల్‌లోనే ఎందుకు నిర్వహిస్తున్నారు.. అనే సందేహం అభిమానుల్లో నెలకొంది.

గతంలో ‘పుష్ప 2’ కోసం బీహార్‌లో చేసిన ప్రయోగం సూపర్ సక్సెస్ అవ్వడంతో, ఇప్పుడు అదే బాటలో ‘పెద్ది’ టీమ్ వెళ్తోంది. నార్త్ ఇండియా మార్కెట్‌లో సినిమాపై బజ్ పెరగాలంటే ఇలాంటి గ్రాండ్ ఈవెంట్ అవసరమని మేకర్స్ భావిస్తున్నారు. అందుకే అల్లు అర్జున్ తరహాలోనే చరణ్‌కు కూడా అక్కడ భారీ క్రేజ్ తెచ్చేందుకు ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చరణ్‌కు హిందీలో మంచి గుర్తింపు వచ్చినప్పటికీ, ‘గేమ్ ఛేంజర్’ వల్ల కలిగిన ప్రభావాన్ని తుడిచేసి మళ్ళీ స్ట్రాంగ్ ఇంప్రెషన్ వేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ‘చికిరి చికిరి’ పాట ఇప్పటికే హిట్ అవ్వగా, ఇప్పుడు భోపాల్ ఈవెంట్ ద్వారా వచ్చే నేషనల్ మీడియా కవరేజ్ సినిమా విజయానికి కీలకం కానుందని వారు భావిస్తున్నారు. మరి భోపాల్ ఈవెంట్‌తో ‘పెద్ది’ ఏ లెవెల్‌లో ఇంపాక్ట్ చూపిస్తాడో చూడాలి.

Exit mobile version