క్రిష్ ‘కంచె’పై ప్రశంసల వర్షం..!

kanche
దర్శకుడు క్రిష్ ఎంతో ఇష్టపడి తన కలల ప్రాజెక్టుగా చెప్పుకుంటూ వచ్చిన ‘కంచె’ సినిమా, దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన విషయం తెలిసిందే! రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో వచ్చిన మొట్టమొదటి ఇండియన్ సినిమా కావడం, ట్రైలర్‌తోనే అందరినీ కట్టిపడేయడం వంటి విషయాలు ఈ సినిమాకు విడుదలకు ముందు బూస్ట్ ఇచ్చే అంశాలుగా నిలిచాయి. ఇక విడుదలకు ముందు కంచె సినిమా విషయంలో కనిపించిన ఆసక్తి విడుదల తర్వాత రెట్టింపైంది.

క్రిష్ మార్క్ బలమైన ఎమోషన్ ఉన్న సినిమాగా కంచె సినిమా అన్నిచోట్లా సూపర్ పాజిటివ్ టాక్‌తో మంచి కలెక్షన్లను రాబడుతోంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఏ సెంటర్లతో పాటు అమెరికాలో ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఇక బాక్సాఫీస్ పరంగానే కాక విమర్షకుల ప్రశంసల పరంగా కంచె సినిమా రోజురోజుకీ స్థాయిని పెంచుకుంటూ పోతోంది. మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్‌తేజ్ తన రెండో సినిమాకే ఇలాంటి కథను ఎంచుకోవడంపై ఇప్పటికే పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువు సినీ, రాజకీయ ప్రముఖులు ఇప్పటికే కంచె సినిమాపై ప్రశంసలు కురిపిస్తుండగా, తాజాగా ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ కూడా ఆ జాబితాలో చేరిపోయారు. కంచె సినిమా చూసిన ఆయన వరుణ్ తేజ్‌కు ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందించారట. ఇలాంటి ఒక మంచి సినిమాలో ఒప్పుకున్నందుకు వరుణ్‌ను, సినిమాను తెరకెక్కించిన క్రిష్‌ను వీవీ వినాయక్ ఈ సందర్భంగా కొనియాడారు.

Exit mobile version