ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మ్యూజిక్ ప్రపంచంలో ది బెస్ట్ గా చెప్పుకునే సంగీత దర్శకుడు మరియు రెండు ఆస్కార్ అవార్డ్స్ గెలుగుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎఆర్ రెహమాన్. ఎఆర్ రెహమాన్ 87వ ఆస్కార్ అవార్డ్స్ బరిలో ఛాన్స్ మిస్ అయ్యాడు. 2014లో ఎఆర్ రెహమాన్ బెస్ట్ ఓరిజినల్ స్కోర్ విభాగంలో ‘మిలియన్ డాలర్ ఆర్మ్’, ‘హండ్రడ్ ఫుట్ జర్నీ’ మరియు ‘కొచ్చాడియాన్’ సినిమాలు ఆస్కార్ బరిలో ఉన్నాయి. కానీ తాజాగా ఆస్కార్ వారు విడుదల చేసిన ఫైనల్ నామినేశంస్ లో ఈ మూడు సినిమాలు లేకపోవడంతో ఎఆర్ రెహమాన్ ఆక్సార్ నుంచి అవుట్ అయ్యాడు.
4 సంవత్సరాల క్రితం ఎఆర్ రెహమాన్ ‘స్లండాగ్ మిలీనియర్’ సినిమాకి గాను ఆస్కార్ అవార్డ్స్ అందుకున్నాడు. ఆ తర్వాత పలు హాలీవుడ్ సినిమాలకు ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ‘ఐ’ సినిమా ఇటీవలే విడుదలైంది. ప్రసతుతం మణిరత్నం చేస్తున్న ‘ఓకే బంగారం’, అశుతోష్ గోవారికర్ ‘మొహెంజో దారో’ మరియు హాలీవుడ్ మూవీ ‘పేలే’కి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఫిబ్రవరి 22న 87వ అకాడమీ ఆస్కార్ అవార్డ్స్ ని ప్రెజెంట్ చేయనున్నారు.
