ప్రస్తుతం టాలీవుడ్ వద్ద అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ది మోస్ట్ ప్రెస్టీజియస్ చిత్రం ‘పెద్ది’ జూన్ 4న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులు మాయం కావడం ఖాయమని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ఈ సినిమాకు మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడని మేకర్స్ ప్రకటించినప్పుడు అందరూ షాక్‌కు గురయ్యారు.
ఫామ్‌లో లేని రెహమాన్ ఈ సినిమాకు పాటలు అందించడం మైనస్ అవుతుందని అందరూ భావించారు. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఏఆర్ రెహమాన్ ‘పెద్ది’ కోసం అదిరిపోయే మ్యూజిక్ ట్రాక్ అందించాడు. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్ ‘చికిరి చికిరి’ పాన్ ఇండియా స్థాయిలో మ్యూజిక్ లవర్స్‌ను కట్టిపడేసింది. ఇక రెండో సాంగ్ ‘రై రై రారా’ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తాజాగా రిలీజ్ అయిన ‘హెల్లాల్లాలో’ పాటకు కూడా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది.
ఇలా ఇప్పటివరకు రిలీజ్ అయిన మూడు పాటలకు కూడా ట్రెమెండస్ రెస్పాన్స్ రావడం.. ఇక ఇప్పటికే విడుదలైన ట్రైలర్లోనూ రెహమాన్ తన మార్క్ బీజీఎంతో ఇంప్రెస్ చేయడంతో.. పెద్ది థియేటర్లలో బ్లాస్ట్ కావడం ఖాయమని అందరూ ఆశిస్తున్నారు. మరి ఈ సినిమాతో రెహమాన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
