‘విశ్వంభర’ రిలీజ్ పై లేటెస్ట్ బజ్.. ఈ ఏడాదిలోనే రిలీజ్ డేట్ లాక్?

మెగాస్టార్ చిరంజీవి నుంచి రానున్న కొత్త చిత్రాలు విశ్వంభర అలాగే కాకా రెండు సినిమాలు విడుదల విషయంలో నెలకొన్న ఆసక్తి ఇపుడు అంతా ఇంతా కాదు. నిజానికి ఎప్పుడో రావాల్సిన విశ్వంభర సినిమా వాయిదా పడుతూ వచ్చే ఏడాది సంక్రాంతి రిలీజ్ అంటూ ప్రచారం జరుగుతుంది. కానీ అదే రేస్ లో కాకా సినిమా బృందం కూడా వెనక్కి తగ్గేది లేదు అంటూ తెగేసి చెప్పేస్తున్నారు.

దీనితో ఈ ఇంట్రెస్టింగ్ క్లాష్ చర్చకు దారి తీసింది.కానీ ఫైనల్ గా విశ్వంభర విడుదలకి కాకా చిత్రానికి ఎలాంటి క్లాష్ లేకుండా ఎట్టకేలకి సాఫీ విడుదల జరగనున్నట్టుగా ఇప్పుడు సమాచారం. ఎందుకంటే విశ్వంభర సినిమా ఈ ఏడాదిలోనే రానుంది అని ఇప్పుడు సమాచారం.

ఈ నవంబర్ 20కి అలా విశ్వంభర విడుదల అయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. వీకెండ్ సహా వీక్ డే హాలిడేస్ కూడా కలిసి వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఇక దీనిపై అధికారిక క్లారిటీ ఈ దసరాకి లేదా అంతకు ముందే రావచ్చు. సో మొత్తానికి మెగా ఫ్యాన్స్ కి ఇది బిగ్ న్యూస్ అని చెప్పవచ్చు.

Exit mobile version