హాలీవుడ్ రీమేక్ కు సంగీతం అందించనున్న ఏ.ఆర్.రెహమాన్ !

సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ ప్రస్తుతం ‘2.0, విజయ్ 62, లిటిల్ డ్రాగన్, చెక్క చివంత వానం, ఆడుజీవితం’ వంటి సినిమాలతో పాటు శివ కార్తికేయన్ తర్వాతి సినిమాకు కూడ సంగీతం చేస్తూనే మరో కొత్త ప్రాజెక్ట్ ఒప్పుకున్నారు. అదే హాలీవుడ్ చిత్రం ‘ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ యొక్క హిందీ రీమేక్.

ఈ హిందీ రీమేక్ కు రెహామన్ స్వరాలు సమకూర్చనున్నారు. దీంతో ఈ సినిమాపై ఇప్పటి వరకు ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయి. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మించనున్న ఈ చిత్రాన్ని నూతన ఆదర్శకుడు ముఖేష్ చబ్బర్ డైరెక్ట్ చేయనున్నాడు. ఇందులో సుశాంత్ సింగ్ రాజపుత్ ప్రధాన పాత్రను పోషించనున్నాడు.

Exit mobile version