పొల్లాచ్చికి వెళ్లనున్న ఎన్టీఆర్ !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నతాజా చిత్రం అరవింద సమేత షూటింగ్ కోసం పొల్లాచ్చి వెళ్లనుంది చిత్ర టీం . ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఒక సాంగ్ ను కూడా తెరకెక్కిన్చనున్నారని సమాచారం . ఈ షెడ్యూల్ ఈ నెల 18 నుండి జులై మొదటి వారం వరకు జరుగనుంది. దీని తరువాతి షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ యూరప్ వెళ్లనుంది .

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని చాలా కేర్ తీసుకొని తెరకెక్కిస్తున్నారు .దసరా కానుకగా రానున్న ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్ పతాకం ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు . తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది .

Exit mobile version