రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు రవి కిరణ్ కోలా తెరకెక్కిస్తున్న సినిమా ‘రౌడీ జనార్దన’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది. ఐతే, ఈ వారం కొన్ని యాక్షన్ సీన్స్ ను తీస్తున్నారని.. ఐతే, ఈ సీన్స్ ను విజయ్ దేవరకొండ లేకుండానే షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ మూవీలో సీనియర్ హీరోయిన్ శోభన నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ లో ఆమె హీరోకి తల్లి పాత్రలో కనిపిస్తోందట. మరి ఈ వార్తలో ఎంత వాస్తవం ఉందో చూడాలి.
కాగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అన్నట్టు రాజశేఖర్ పాత్ర అండ్ ఆయన లుక్ మునుపెన్నడూ చూడని రీతిలో ఉంటుందట. ఇప్పటికే, లుక్ టెస్ట్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా కథ గ్రామీణ నేపథ్యంలో సాగనుంది. ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా కీర్తి సురేశ్ నటించనుంది. మొత్తానికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.
