ఫోటో మూమెంట్: ఫైనల్ కాపీని లాక్ చేసిన ‘అర్జున్ S/O వైజయంతి’

arju 2

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా దర్శకుడు చిలుకూరి ప్రదీప్ తెరకెక్కించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘అర్జున్ S/O వైజయంతి’ ఈ నెల 18న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక రిలీజ్‌కు మరికొద్ది గంటలే మిగిలి ఉండటంతో ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులను ముగించుకుంటున్నారు చిత్ర యూనిట్.

ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ కాపీని కూడా చిత్ర యూనిట్ లాక్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తమ ఫైనల్ కాపీని చూసి పూర్తి కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లు తెలిపారు. ప్రేక్షకులను ఈ సినిమా ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందులోని యాక్షన్, ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుందని వారు చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు రావడం ఖాయమని వారు తెలిపారు.

ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా సోహైల్ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తు్న్న ఈ సినిమాను సునీల్ బలుసు, అశోక్ వర్ధన్ ముప్పా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version