ఆర్యన్ గౌర, మోనిషా మోహన్ జంటగా ‘JAAN’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్ పోస్టర్

ఆర్యన్ గౌర, మోనిషా మోహన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘JAAN’. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. లక్ష్మీ నరసింహా మోషన్ పిక్చర్స్ పతాకంపై నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆర్యన్ గౌర స్వయంగా కథ అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు.

విడుదలైన పోస్టర్‌లో వీల్‌చైర్‌లో కూర్చున్న మోనిషా వెనుక ఆర్యన్ నిలబడి ఉండగా, టైటిల్ లోగో డిజైన్‌లోనూ వీల్‌చైర్‌ను భాగంగా చూపించడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ చిత్రంలో రావు రమేష్, బాబా భాస్కర్, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమాకు జాతీయ అవార్డు గ్రహీత జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆయన గతంలో ‘సూరరై పోట్రు’ (ఆకాశం నీ హద్దురా), ‘వాతి’ (సార్), ‘అమరన్’ వంటి చిత్రాలకు జాతీయ పురస్కారాలు అందుకున్నారు.

Exit mobile version