అందాల భామ ఆషిక రంగనాథ్ ప్రస్తుతం టాలీవుడ్లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ఇటీవల సంక్రాంతి బరిలో మాస్ రాజా రవితేజ సరసన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే సినిమాలో నటించిన ఆమెకు ఆ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో బూస్ట్ లభించింది. అయితే, గతంలోనే ఆమె టాలీవుడ్‌కు పరిచయమైనా సరైన హిట్ మాత్రం పడలేదు.
ఇక మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’లో కూడా ఈ కన్నడ బ్యూటీ నటిస్తోంది. అయితే, ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో సాలిడ్ హిట్ అందుకున్న ఈ భామ, ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను ఓకే చేసినట్లు తెలుస్తోంది. చార్మింగ్ స్టార్ శర్వానంద్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను దర్శకుడు శ్రీను వైట్ల డైరెక్షన్లో చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
ఈ సినిమాలో హీరోయిన్గా ఆషిక రంగనాథ్‌ను మేకర్స్ సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. శర్వా పక్కన ఆమె కెమిస్ట్రీ బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. ఇక ఈ సినిమా షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించి ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 2026 సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ అందుకున్న ఆషిక, మరోసారి 2027 సంక్రాంతికి కూడా సందడి చేయనుండటం విశేషం.
