ఏది ఏమైనా మే 9న రేయ్ వస్తుంది – వైవిఎస్ చౌదరి

yvs-chowadery
గత రెండు సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఈ సారి చేసిన సినిమా కచ్చితంగా సూపర్ హిట్ కావాలని వైవిఎస్ చౌదరి చేస్తున్న ప్రయత్నమే ‘రేయ్’. వైవిఎస్ చౌదరి ఈ సినిమాతో మెగా ఫ్యామిలీకి చెందిన సాయి ధరమ్ తేజ్ ని హీరోగా లాంచ్ చేస్తున్నాడు. అమెరికా, కరేబియన్ దీవుల్లో షూట్ చేసిన ఈ సినిమాలో శ్రద్దా దాస్, సయామీ ఖేర్ హీరోయిన్స్ గా నటించారు.

మే 9న రానున్న ‘రేయ్’ సినిమాకి సంబందించిన రెండవ ట్రైలర్ ని ఈ రోజు హీరో రామ్ చేతుల మీదుగా లాంచ్ చేసారు. ఈ కార్యక్రమంలో వైవిఎస్ చౌదరి మాట్లాడుతూ ‘ సలీం సినిమా చేస్తున్నప్పుడు సాయి ధరమ్ తేజ్ ని చూసి అతనితో సినిమా చేయాలనుకున్నాను. తనతో వర్క్ చేయడం చాలా ఎనర్జిటిక్ గా ఉంటుంది. ఇప్పటికే విడుదలైన ఆడియోకి, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆరు నూరైనా, నోరు నూట యాభై అయినా మే 9న సినిమా రేయ్ సినిమా రిలీజ్ అవుతుంది. అలాగే చిత్ర పరిశ్రమలో పెర్ఫెక్షనిస్ట్ కి రకరకాల పేర్లు పెట్టి ఆనందిస్తుంటారు. అయినాసరే నాకు నచ్చింది, నేను అనుకున్నదే చేస్తాను. ముక్కుసూటిగానే మాట్లాడతానని’ అన్నాడు.

అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామ్ ఈ సినిమా విజయం సాధించాలని కోరగా, సాయి ధరమ్ తేజ్ ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని అన్నాడు.

Exit mobile version