అథర్వా మురళి యాక్షన్ థ్రిల్లర్ ‘టన్నెల్’ – సెప్టెంబర్ 12న గ్రాండ్ రిలీజ్

tsel

కోలీవుడ్ నటుడు అథర్వా మురళి నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘టన్నెల్’. ఈ సినిమాకు రవీంద్ర మాధవ దర్శకత్వం వహించారు. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించగా, అశ్విన్ కాకుమాను విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదల కానుంది. తెలుగులో ఈ సినిమాను లచ్చురామ్ ప్రొడక్షన్స్ ద్వారా ఎ.రాజు నాయక్ విడుదల చేస్తున్నారు.

తమిళంలో విడుదలైన ట్రైలర్ మంచి స్పందన పొందింది. ఇందులో అథర్వా మురళి పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారు. క్రూరమైన హత్యలు, వాటి వెనుక ఉన్న సైకోను పట్టుకునే ప్రయత్నం ఈ సినిమా కథాంశం. ట్రైలర్‌లో యాక్షన్ సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. శక్తి శరవణన్ సినిమాటోగ్రాఫర్‌గా, కలైవానన్ ఎడిటర్‌గా పనిచేశారు.త్వరలో తెలుగు వెర్షన్ ప్రమోషన్లు, ట్రైలర్ విడుదల చేయనున్నారు. అథర్వా మురళి కూడా తెలుగు ప్రమోషన్లలో పాల్గొంటారు.

Exit mobile version