మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చేసే సినిమా కాన్సెప్ట్ ఏదైనా కామెడీ మాత్రం కామన్ గా ఉంటుంది. తాను చేసే సీరియస్ ఎమోషనల్ చిత్రాలలో చాలా పాత్రలు కామెడీతో నడుస్తాయి. కాగా ప్రస్తుతం ఆయన అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న హ్యాట్రిక్ మూవీ అల వైకుంఠపురంలో వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రాలు రావడం జరిగింది. ఈ మూవీలో కూడా కామెడీ ఓ స్థాయిలో ఉంటుందని సమాచారం. ఐతే ఈ మూవీలో త్రివిక్రమ్ చిరకాల మిత్రుడు సునీల్ కూడా నటిస్తున్నారు.
కొద్దికాలం వరకు హీరోగా కొనసాగిన సునీల్ ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయి కమెడియన్ గా మారే ప్రయత్నం చేస్తున్నారు. గత ఏడాది త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో చేసిన అరవింద సమేత వీరరాఘవ చిత్రంలో నీలాంబరి గా సునీల్ కనిపించడం జరిగింది. ఐతే ఆ పాత్ర సునీల్ కి అంతగా ఆఫర్లు తెచ్చిపెట్ట లేకపోయింది. ఇక గోపీచంద్ చాణక్య మూవీలో కూడా ఆయన కామెడీ రోల్ చేయడం జరిగింది. గతంలో మాదిరి సునీల్ కి కమెడియన్ గా వరుస అవకాశాలు రావాలంటే ఓ మంచి కామెడీ రోల్ ఆయనకు పడాలి. అలవైకుంఠపురంలో చిత్రంలో కూడా సునీల్ ఓ పాత్ర చేస్తున్నారు. మరి త్రివిక్రమ్ స్నేహితుడి ని ఈ అవకాశంతోనైనా ఫుల్ బిజీ చేస్తాడో లేదో చూడాలి.
