వర్మ ‘అటాక్’ కొత్త ట్రైలర్ రిలీజ్..!

Attack

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో మనోజ్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో అటాక్ పేరుతో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. క్రైమ్ జానర్లో పలు విజయవంతమైన సినిమాలను తీసిన వర్మ, మళ్ళీ అదే జానర్లో చేస్తోన్న ఈ సినిమాపై అంతటా మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ఈ సినిమాపై ఆసక్తి రేకెత్తించగా తాజాగా ఈ ఉదయం హైద్రాబాద్‌లో అటాక్ యూనిట్ రెండో ట్రైలర్‌ను విడుదల చేసింది.

‘అటాక్’ సినిమాతో వర్మ అభిమానులు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న ఓ సరైన హిట్ తప్పక వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకూ రిలీజ్ అయిన పోస్టర్స్ కూడా వర్మ ఈజ్ బ్యాక్ అనే స్లోగన్‌ను మోసుకొస్తున్నాయి. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో గతంలో వచ్చిన సర్కార్ సినిమా తరహా కథాంశంతో ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను నవంబర్ నెలలో విడుదల చేయనున్నట్లు సినిమా యూనిట్ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ప్రకటించింది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version