‘అటాక్’ ట్రైలర్ : వర్మ మార్క్ క్రైమ్ సినిమా!

attack

ఒకప్పుడు అద్భుతమైన సినిమాలతో మనల్ని మెప్పించిన సెన్సేషనల్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, గత కొంతకాలంగా తన మార్క్ సినిమాను తీయలేకపోయారు. అయితే అభిమానులు మాత్రం ఎప్పుడెప్పుడు వర్మ తన మార్క్ సినిమా తీస్తాడా అని ఎదురుచూస్తూనే ఉన్నారు. తాజాగా వర్మ తనకు బాగా అలవాటైన క్రైమ్ నేపథ్యంలో, సర్కార్ తరహా కథాంశంతో ‘అటాక్’ అనే సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే! మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

‘అటాక్’ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను నిన్న విడుదల చేయగా దానికి మంచి స్పందన వచ్చింది. తాజాగా కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో రామ్ గోపాల్ వర్మ స్టైల్, టేకింగ్ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రకాష్ రాజ్, జగపతి బాబు, మంచు మనోజ్‌ల క్యారెక్టరైజేషన్ కూడా అదిరిపోయేలా ఉండనుందనేది ట్రైలర్ చూస్తే తెలిసిపోతోంది. సోషల్ మీడియాలో వర్మ మళ్ళీ ‘రక్తచరిత్ర’ లాంటి పవర్‌ఫుల్ సినిమా తెరకెక్కించాడనే టాక్ వినపడుతోంది. మరి వర్మ తన మార్క్ క్రైమ్ సినిమాగా ఈ సినిమాను తెరకెక్కించాడా? ఈ సినిమాతోనైనా వర్మ తన అభిమానులను మళ్ళీ మెప్పిస్తాడా? అన్నది వేచిచూడాలి.

‘అటాక్’ ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version