షూటింగ్ మొదలైన ‘అత్తారింటికి దారేది’ తమిళ్ వర్షన్ !

simbu
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ కలెక్ట్ చేసిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం తమిళంలోకి రీమేక్ అవ్వబోతున్న విషయం తెలిసిందే. కాగా తమిళ వర్షన్ షూటింగ్ నేడు జార్జియాలో ప్రారంభమైంది. సుందర్ సి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శింబు హీరోగా నటిస్తుండగా, ఖుష్బూ ప్రధాన పాత్రలో నటిస్తోంది. తమిళంలో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఈ చిత్రంలో శింబు సరసన మేఘ ఆకాష్ లో హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ‘అత్తారింటికి దారేది’ చిత్రం తమిళ ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తుందని చిత్రబృందం నమ్మకంగా చెబుతుంది.

Exit mobile version