ప్రేక్షకులు ఎప్పుడూ ఆశ్చర్యానికి గురిచేస్తారు : రాఘవేంద్రరావు

Raghavendra-Rao
ఈ.టి.వి లో ప్రసారమవుతున్న సౌందర్యలహరి షోలో దర్శకులు కే. రాఘవేంద్రరావుగారు తన సినిమా రంగంలో ఆసక్తికర అంశాలని వెల్లడించారు. ఈ షోకి ఇప్పటికే ప్రాముఖ్యత సంతరించుకుంది. దాని ఫస్ట్ ఎపిసోడ్ లో రాఘవేంద్రరావు తన మనసులో మాటలను పంచుకున్నారు

“నేను సినిమా ప్రచారంలో భాగంగా వివిధ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ప్రేక్షకులు నన్నెప్పుడు ఆశ్చర్యానికి గురిచేస్తారు. ఒక సినిమా విజయం సాధించడానికి లేక పరాజయం పాలవ్వడానికి వాళ్ళు చెప్తున్న కారణాలు వింటుంటే మతిపోతుంది. వారి దగ్గరనుండి చాలా నేర్చుకోవాలి” అని తెలిపారు

ఈ సినిమా రంగంలో మన మౌన ముని 50ఏళ్ళు గడిపారు. సినిమా వైభవం, దర్శకత్వంలో మెళుకువలు తెలుపుతూ ప్రస్తుతం షో ని నిర్వహించే పనిలో వున్నారు

Exit mobile version