
‘మనం’ తో సక్సెస్ అందుకొని ఫుల్ జోష్ మీదున్న అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఆటోనగర్ సూర్య’ సినిమా ఫైనాన్సియల్ ఇబ్బందుల కారణంగా చాలా రోజుల తర్వాత విడుదలకి సిద్దమవుతోంది. ఈ సినిమాని జూన్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
అందులో భాగంగా ఈ మూవీ రేపు సెన్సార్ కార్యక్రమాలను జరుపుకోనుంది. అలాగే ఈ సినిమా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ని జూన్ 25న జరపనున్నారు. దేవా కట్టా డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నగ చైతన్య సరసన సమంత హీరోయిన్ గా నటించింది. ఆర్ఆర్ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు.