‘కేరింత’లో గ్లామరస్ టచ్ ఇవ్వనున్న అవంతిక

avanthika
ఎంతో మంది కొత్తవాళ్ళకి అవకాశం ఇచ్చి కమర్షియల్ గా సక్సెస్ఫుల్ అందుకున్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రస్తుతం లో బడ్జెట్ లో ‘కేరింత’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ‘వినాయకుడు’ ఫేం సాయి కిరణ్ అడవి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సుమంత్ అశ్విన్, లావణ్య త్రిపాటి హీరో, హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ‘మాయ’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అవంతిక నటిస్తోంది. మొదటి సినిమా ‘మాయ’ లో బాగా ట్రెడిషనల్ గా కనిపించిన అవంతిక ‘కేరింత’ సినిమాలో ఎన్నారై గర్ల్ గా పూర్తి గ్లారాస్ లుక్ లో కనిపించనుంది. ‘మాయ కంటే ముందే కేరింత సినిమాకి సైన్ చేసాను. అలాగే సినిమా చాలా బాగా వస్తోంది. ఈ మూవీలో గ్లామరస్ లుక్ లో కనిపిస్తాను. చాలా ఆఫర్లు వస్తున్నాయి, కానీ వరుసగా ఫాస్ట్ ఫాస్ట్ గా సినిమాలు చేసెయ్యాలని లేదని’ అవంతిక తెలిపింది.

హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ అక్టోబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మిక్కీ జె మేయర్ సంగీతం, అబ్బూరు రవి మాటలు అందిస్తున్న ఈ సినిమా ద్వారా ఎడిటర్ గా మధు, సినిమాటోగ్రాఫర్ గా విశ్వ, కొరియోగ్రాఫర్ గా విజయ్ లని తెలుగు తెరకు పరిచయం చేస్తున్నారు.

Exit mobile version