వేరే దర్శకుల కోసం కథల్ని ఇచ్చేస్తున్న శ్రీనివాస్ అవసరాల !

శ్రీనివాస్ అవసరాల రచయితగా, నటుడిగా తెలుగువారికి పరిచయమై ఆ ఆతర్వాత దర్శకుడిగా కూడా తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఒకవైపు దర్శకుడిగా మంచి హితలందుకుంటున్న నటుడిగా మంచి మంచి రోల్స్ చేస్తున్నారు. అయినా కూడా రచయితగానే ఉండటం ఇష్టమంటున్న అవసరాల తన కథలను వేరే దర్శకులకు కూడా ఇస్తున్నారు.

ఆయనిచ్చిన కథలతో ఇద్దరు దర్శకులు సినిమాలు చేస్తున్నారు. ఇక ప్రముఖ బ్యానర్స్ సితార ఎంటర్టైన్మెంట్స్ లో థ్రిల్లర్ కథను, వారాహి చలన చిత్రంలో ఒక ప్రేమ కథను చేయనున్నారు అవసరాల. ఇక నటుడిగా అయితే అల్లు శిరీష్ యొక్క ‘ఒక క్షణం’ లో అలాగే ‘!, మహానటి’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు చేస్తున్నారు.

Exit mobile version