పాన్ వరల్డ్ నెంబర్ 1 దర్శకుడు జేమ్స్ కేమెరూన్ నుంచి వస్తున్న మరో అవైటెడ్ ఫెంటాస్టిక్ విజువల్ ట్రీట్ చిత్రమే “అవతార్: ది ఫైర్ అండ్ యష్” (Avatar 3). ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఇండియాలో కూడా చాలా ఎక్కువ ఉన్నారు. ఇలా ఇండియా వరకు వచ్చేసరికి బిగ్గెస్ట్ స్టార్ దర్శకులు తమ రెస్పాన్స్ ని చెబుతున్నారు. ఇక లేటెస్ట్ గా ఈ లిస్ట్ లో ఇండియాస్ బిగ్గెస్ట్ గ్రాసర్ దర్శకుడు సుకుమార్ ఇచ్చిన వీడియో రివ్యూ మంచి వైరల్ గా మారింది.
Sukumar Review on Avatar 3 – అవతార్ 3 పై సుకుమార్ ఏమన్నారంటే..
తాను జస్ట్ ఈ మధ్యనే హైదరాబాద్ ప్రసాద్స్ మల్టీప్లెక్స్ లో స్పెషల్ షో చూడడం జరిగింది. ఇక దాని తర్వాత తన ఎగ్జైట్మెంట్ ని తాను షేర్ చేసుకున్నారు. ప్రపంచ సినిమా దగ్గర జేమ్స్ కేమెరూన్ ఒక అవతార్ (Avatar 3 Telugu) అయితే మేము మనుషులం అని అందుకున్నారు. ఇక అవతార్ 3 సినిమా అద్భుతంగా ఉందని కేవలం బిగ్ స్క్రీన్ పై మాత్రమే చూసే సినిమా ఇదని తెలిపారు.
కొన్ని చోట్ల కదిలించే ఎమోషన్స్ తో ఏదో మన తెలుగు సినిమానే చూస్తున్నట్టుగా ఉందని తాను తెలిపారు. ఫ్యామిలీస్ లో ప్రతీ ఒక్కరూ ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చని నేను ఒక్కడినే ఈ సినిమా చూసాను ఇక పండోరా ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది అని క్రియేటివ్ దర్శకుడు ఇచ్చిన వ్యూస్ రివ్యూని నిర్మాణ సంస్థ 20త్ సెంచరీ స్టూడియోస్ వారు షేర్ చేసుకున్నారు.
Rajamouli on Avatar 3: సుకుమార్ ముందు రాజమౌళి రివ్యూ..
దర్శకుడు జేమ్స్ కేమెరూన్ తో స్పెషల్ ఇంటర్వ్యూ రాజమౌళి చేసిన సంగతి తెలిసిందే. దీనిలో మాటల్తో తాను కూడా ఆల్రెడీ సినిమా చూసేసినట్టు కన్ఫర్మ్ అయ్యింది. తాను కూడా ఎంతో ఎగ్జైట్ అయినట్టు తెలిపారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి