‘చిన్నారి పెళ్లికూతురు’ సక్సెస్ఫుల్ సీరియల్ ద్వారా అంధ్రప్రదేశ ప్రేక్షకులకు పరిచయమైన నార్త్ ఇండియన్ భామ అవిక గోర్. బుల్లితెరను మెప్పించిన అవిక గోర్ ‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమై హీరోయిన్ గా కూడా మెప్పించింది. తను హీరోయిన్ గా చేసిన రెండవ సినిమా ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ గత శుక్రవారమే విడుదలై మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. కానీ తన నటనకి మాత్రం ప్రేక్షకుల నుంచి, విమర్శకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి.
ఇలా నటనతో తెలుగు ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తున్న అవిక గోర్ గ్లామరస్ పాత్రలకు మాత్రం నో అంటోంది. ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అవిక గోర్ మాట్లాడుతూ ‘ గ్లామరస్ పాత్రలకి మరియు స్కిన్ షో కి నేను స్ట్రిక్ట్ గా నో చెప్పేస్తాను. టాలీవుడ్ లో నేను నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలే చెయ్యాలి అనుకుంటున్నానని’ తెలిపింది. నార్త్ ఇండియన్ టీవీ సీరియల్స్ ద్వారా బాగా పేరున్న అవిక గోర్ కి వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి. మరి ముందు ముందు ఎలాంటి సినిమాలకు సైన్ చేస్తుందో చూడాలి.
