‘అవును’ పార్ట్ 2 స్క్రిప్ట్ అప్పుడే రెడీ చేశా – రవిబాబు

ravibabu
వైవిధ్యమైన కధంశాలతో సినిమాలు రూపొందించే అతి తక్కువ మంది తెలుగు దర్శకులలో రవిబాబు ఒకరు. తొలిసారిగా ఒక సీక్వెల్ కు దర్శకత్వం వహిస్తున్నారు. తను దర్శకత్వం వహించిన హిట్ సినిమా ‘అవును’కు కొనసాగింపుగా ‘అవును 2’ సినిమాను తెరకెక్కించారు. డిసెంబర్ లో ఈ సినిమా విడుదల కానుంది.

‘అవును’ సినిమా తీస్తున్న సమయంలోనే పార్ట్ 2 చేయాలనే నిర్ణయం తీసుకున్నాను. స్క్రిప్ట్ కూడా అప్పుడే రెడీ చేశాను. చాలా మంది ‘అవును’ సినిమాకు సరైన ముగింపు ఇవ్వలేదని అడిగారు. వారికి నా సమాధానమే ‘అవును 2’. ఇది సీక్వెల్ కాదు, పార్ట్ 2. ‘అవును’ ఎక్కడైతే ముగిసిందో, పార్ట్ 2 అక్కడ నుండి ప్రారంభమవుతుంది. పార్ట్ 1 కంటే థ్రిల్లింగ్ మూమెంట్స్ ఈ సినిమాలో ఎక్కువ ఉంటాయి. అని తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రవిబాబు తెలిపారు

హర్షవర్ధన్ రాణే, పూర్ణ జంటగా నటించిన ఈ సినిమాలో రవిబాబు, నికిత, సంజన కీలక పాత్రలలో కనిపిస్తారు. ఫ్లయింగ్‌ ఫ్రాగ్స్‌, సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

Exit mobile version