ఓటీటీ వేదిక : ఆహా
ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ : జూలై 29, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ 2.75/5
నటీనటులు : తేజ కల్వకోట, హర్ష వర్ధన్, శశాంక్, గీతా భాస్కర్, రవి వర్మ తదితరులు
దర్శకత్వం : శివ తేజ
నిర్మాత : రచన రెడ్డి ములుముడి
సంగీతం : సూర్య తేజ
ఛాయాగ్రహణం : గౌతమ్ బండ్రెడ్డి
కూర్పు : శివ తేజ
సంబంధిత లింక్స్ : ట్రైలర్
కొన్నేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఫ్రీడమ్ 251’ స్మార్ట్‌ఫోన్ స్కామ్ నేపథ్యంలో తెరకెక్కిన తెలుగు వెబ్ సిరీస్ ‘ఆజాదీ 501’. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో జూలై 29 నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌కు వచ్చింది. మరి ఈ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ డ్రామా ప్రేక్షకులను ఏమేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.
కథ:
జీవితంలో పెద్ద వ్యాపారవేత్తగా ఎదగాలని చూసే జిత్తు(తేజ కల్వకోట) కేవలం రూ.501లకే ఒక స్మార్ట్‌ఫోన్‌ను ప్రజలకు అందించాలే ఆలోచనతో ఓ స్టార్టప్ కంపెనీ ప్రారంభిస్తాడు. దీంతో రాత్రికి రాత్రే దేశమంతటా కోట్లల్లో ప్రీ-బుకింగ్స్ వస్తాయి. అయితే, ఆర్డర్లు డెలివరీ చేయడంలో జాప్యం జరగడంతో అనుమానాలు మొదలవుతాయి. దీని వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు? ఈ ప్లాన్ వెనుక ఉన్న ఆర్థిక అక్రమాలు ఏమిటి? పత్రికా విలేకరులు, ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఈ పెద్ద స్కామ్‌ను ఎలా బయటపెట్టాయి? అనేదే ఈ సిరీస్ కథ.
ప్లస్ పాయింట్స్:
ఈ వెబ్ సిరీస్‌కు మేజర్ ప్లస్ పాయింట్ దీని ప్లాట్ అని చెప్పాలి. రియల్ లైఫ్ టెక్నాలజీ స్కామ్ ఆధారంగా కథను ఎంచుకోవడం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఈ సిరీస్‌ను మలిచిన తీరు బాగుంది.
లీడ్ రోల్ చేసిన తేజ కల్వకోట తన పాత్రలో చాలా సహజంగా నటించాడు. సపోర్టింగ్ రోల్స్ చేసిన నటీనటులు కూడా తమ పరిధి మేర ఆకట్టుకున్నారు. కొన్ని సీన్స్‌లోని డ్రామా ఆడియన్స్‌ను మెప్పిస్తుంది.
ఇన్వెస్టిగేషన్ సీన్స్, ఆడిటింగ్ లొసుగులు బయటపడే సన్నివేశాలు వంటివి ఎంగేజింగ్‌గా సాగుతాయి. సిరీస్ మధ్యలో వచ్చే కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్స్ మరియు ప్రీ-క్లైమాక్స్ ట్విస్టులు ఆకట్టుకుంటాయి.
మైనస్ పాయింట్స్:
సిరీస్ ప్రారంభ సన్నివేశాలు చాలా నిదానంగా సాగుతాయి. పాత్రల ఇంట్రోకి సమయం ఎక్కువగా తీసుకోవడంతో కథ అసలు పాయింట్‌కి రావడానికి చాలా సమయం పడుతుంది.
ఒక పెద్ద స్కామ్ చుట్టూ తిరిగే కథ అయినప్పటికీ, ఉండాల్సినంత హై-వోల్టేజ్ డ్రామా లేదా టెన్షన్ ఇందులో కనిపించదు. థ్రిల్లర్ జోనర్ అయినప్పటికీ, కొన్ని సన్నివేశాలు ముందే ఊహించేలా ఫ్లాట్‌గా వెళ్తాయి.
కొన్ని చోట్ల ఎమోషనల్ సీన్స్ అంతగా పండలేదు. డ్రామాను ఇంకాస్త పకడ్బందీగా రాసుకుని ఉంటే బాగుండేది. నెరేషన్ విషయంలోనూ ఇంకాస్త పర్ఫెక్షన్ చూపెట్టాల్సింది.
సాంకేతిక విభాగం:
దర్శకుడు శివ తేజ ఎంచుకున్న పాయింట్ బాగుంది. అయితే, స్క్రీన్‌ప్లేను కొన్ని చోట్ల మరింత టైట్‌గా రాసుకుని ఉంటే ఈ సిరీస్‌కు ప్లస్ అయ్యేది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. ముఖ్యంగా హీరో పాత్ర ఎలివేషన్ సీన్స్, ఇన్వెస్టిగేషన్ సీన్స్‌లో బీజీఎం ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త వర్కవుట్ చేయాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు.
తీర్పు:
ఓవరాల్‌గా చూస్తే, ‘ఆజాదీ 501’ సిరీస్ ఒక మంచి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఇన్వెస్టిగేటివ్ డ్రామాగా పర్వాలేదనిపిస్తుంది. అక్కడక్కడా కథనం నెమ్మదించినప్పటికీ, ఇన్వెస్టిగేషన్ సీన్స్, నటీనటుల పెర్ఫార్మెన్స్‌లు ఆకట్టుకుంటాయి. ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్స్ మరియు రియల్ లైఫ్ స్కామ్ ఆధారిత డ్రామాలను ఇష్టపడేవారు ఈ సిరీస్‌ను ఓసారి ట్రై చేయవచ్చు.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team
