వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తమిళ నటుడు చియాన్ విక్రమ్ తన 63వ సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. ఈ చిత్రానికి ‘పవర్ హౌస్’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన టైటిల్ టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.
ఈ టీజర్లో విక్రమ్ రెండు విభిన్నమైన షేడ్స్‌లో కనిపిస్తూ ఆకట్టుకున్నారు. ప్రథమార్థంలో ఒక క్యాటరర్‌గా కనిపించిన ఆయన, ద్వితీయార్థంలో మాత్రం తనదైన మాస్ యాక్షన్‌తో అదరగొట్టారు. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రియా శిబు విక్రమ్ మేనకోడలిగా నటిస్తున్నారు. సత్యజ్యోతి ఫిలింస్ పతాకంపై సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.
