‘బా బా బ్లాక్ షీప్’ నుంచి ‘వెవెలా ఊహలే చూపినా..’ పాట విడుదల

చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందుతున్న క్రైమ్ కామెడీ చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’ నుంచి రెండో పాట ‘వెవెలా ఊహలే చూపినా..’ విడుదలైంది. ఈ పాటను దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు. దోనేపూడి చక్రపాణి సమర్పణలో వేణు దోనేపూడి నిర్మిస్తున్న ఈ చిత్రానికి గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 9న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

​రెట్రో శైలిలో సాగే ఈ పాటకు కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించగా, శ్రీ సాగర్ ఆలపించారు. చిత్రంలో ప్రధాన పాత్రలు ఓ అరుదైన పెట్టె కోసం వెతుకుతున్న ముఠాకు ఎదురుపడే నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లో ఈ పాట సాగుతుంది.

​ఈ సినిమాను పూర్తిగా మేఘాలయ రాష్ట్రంలోనే చిత్రీకరించినట్లు నిర్మాత వేణు దోనేపూడి తెలిపారు. చిరపుంజితో సహా అక్కడి పలు ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న తొలి దక్షిణాది చిత్రం ఇదేనని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు చివరి దశకు చేరుకున్నాయని వెల్లడించారు.

​ఈ చిత్రంలో టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్, కార్తికేయ, విస్మయశ్రీ, మాళ్వీ మల్హోత్రా, రాజారవీంద్ర ప్రధాన పాత్రల్లో నటించారు. స్టీఫెన్, ఆనంద్ సంగీతం అందించగా, అజయ్ అబ్రహం జార్జ్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు.

Exit mobile version