
ఈ ఏడాది టాలీవుడ్ లోనే కాదు, బాలీవుడ్ లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసి త్వరలో ఇంటర్నేషనల్ రిలీజ్ కి సిద్దమవుతున్న సినిమా ‘బాహుబలి’. టాలీవుడ్ జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి క్రియేట్ చేసిన ఈ విజువల్ వండర్ బాక్స్ ఆఫీసు వద్ద సౌత్ ఇండియన్ నెంబర్ వన్ గ్రాసర్ గా నిలవడమే కాకుండా బాలీవుడ్ లో కూడా 100 కోట్ల మార్క్ ని క్రాస్ చేసింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా రిలీజ్ అయిన నాటి నుంచి అందరి మదిలోనూ ఉన్న ప్రశ్న కట్టప్పబాహుబలిని ఎందుకు చంపాడు.? అది తెలియాలంటే బాహుబలి2 వరకూ ఆగాల్సిందే..
దానికంటే ముందు బాహుబలి 2 సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. వారి కోసం మేము షూటింగ్ అప్డేట్ ని అందిస్తున్నాం. బాహుబలి సినిమా షూటింగ్ ని డిసెంబర్ 14 నుంచి మొదలు పెట్టనున్నారు. డిసెంబర్ లో కొన్ని కొన్ని సింపుల్ సీన్స్ ని మాత్రమే షూట్ చేయనున్నారు. రెగ్యులర్ షూటింగ్ ని జనవరి నుంచి మొదలు పెట్టనున్నారు. ఇప్పటికే 40% షూటింగ్ ఫినిష్ చేసామని చెప్పిన రాజమౌళి మిగిలిన షూటింగ్ కోసం అన్ని ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ని ఫినిష్ చేస్తున్నాడు.
బాహుబలి 2 కోసం 190-200 రోజుల పాటు షూటింగ్ చేయనున్నారు. ప్రభాస్ సుమారు 10 నెలల పాటు తన పూర్తి కాల్షీట్స్ ని బాహుబలి 2 కి కేటాయించేసాడు. బాహుబలి 1 కంటే బాహుబలి 2 మరింత గ్రాండ్ గా ప్లాన్ చేసాడు రాజమౌళి. బాహుబలి 2 తో ఆపెయకుండా బాహుబలి అనే పేరుని అలానే కొనసాగించాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నాడు.