అక్టోబర్ మిడిల్లో షురూ కానున్న ‘బాహుబలి 2’

baahu-bali
నెల రోజుల క్రితం రిలీజ్ అయిన టాలీవుడ్ మోస్ట్ ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్ ‘బాహుబలి’ తెలుగు ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్స్ పరంగా సౌత్ ఇండియాలోనే టాప్ గ్రాసర్ గా నిలించింది. అంతటితో ఆగకుండా ఇండియా టాప్ గ్రాసర్స్ లో మూడవ స్థానాన్ని కొట్టేసింది. టాలీవుడ్ జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి ఊహల నుంచి పుట్టిన ఈ అద్భుత సృష్టికి ప్రేక్షకులతో పాటు విమర్శకులు కూడా నీరాజనాలు పట్టారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలిగా, శివుడుగా కనిపించిన ఈ సినిమాలో రానా భళ్లాలదేవగా కనిపించాడు. అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ ముఖ్య పాత్రలు పోషించారు. బాహుబలి ది బిగెనింగ్ చూసిన పతి ఒక్కరూ సెకండ్ పార్ట్ అయిన ‘బాహుబలి – ది కంక్లూజన్’ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

అన్ని పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ ని పూర్తి చేసిన ఎస్ఎస్ రాజమౌళి అండ్ టీం నిన్నటి నుంచి బాహుబలి పార్ట్ 2 ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించారు. ముందు నుంచి సెకండ్ పార్ట్ షూటింగ్ ని సెప్టెంబర్ నుంచి మొదలు పెట్టాలనుకున్నారు. కానీ మాకు అందిన కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అక్టోబర్ మిడిల్ నుంచి బాహుబలి పార్ట్ 2 రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ లోపు రాజమౌళి కథని మరోసారి తరవుగా ప్లాన్ చేసుకొని సెకండ్ పార్ట్ లో తీయబోయే వార్ ఎపిసోడ్స్ ని కూడా స్పెషల్ గా డిజైన్ చేయనున్నారు. ప్రస్తుతం హాలిడే ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్ కూడా త్వరలోనే వచ్చి ప్రీ ప్రొడక్షన్ సిట్టింగ్ లో పాల్గొనడమే కాకుండా, మళ్ళీ తన ఫిజిక్ కోసం వర్కౌట్స్ మొదలు పెట్టనున్నాడు.

Exit mobile version