
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి ఇండియన్ సినిమాలో ఓ ప్రభంజనం సృష్టించిన ‘బాహుబలి’ సినిమాకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌కు ఓ సరికొత్త మార్గాన్ని సూచించిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు యూట్యూబ్‌లో వ్యూస్ వర్షం కురిపించడానికి ఆన్‌లైన్లో పూర్తి సినిమాతో మనముందుకు రాబోతోంది. జూలై 10న విడుదలైన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, మళయాలంలో టీవీల్లోనూ ప్రదర్శితమై అక్కడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
ఇక రేపు సాయంత్రం తెలుగు, తమిళ, మళయాల వర్షన్స్‌కు సంబంధించిన పూర్తి సినిమాను బాహుబలి టీమ్ యూట్యూబ్‌లో విడుదల చేయనుంది. సాయంత్రం 6గంటల తర్వాత పూర్తి సినిమా ఆన్‌లైన్లో విడుదల కానుంది. 4కే రిసల్యూషన్‌తో అల్ట్రా హెచ్‌డీ వర్షన్ రేపట్నుంచి యూట్యూబ్‌లో హల్‌చల్ చేయనుంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్దే ఓ రేంజ్‌లో అలరిస్తే మరి రేపు విడుదలయ్యే ఆన్‌లైన్ రిలీజ్‌తో వ్యూస్ పరంగా ఇంకే రేంజ్‌లో అలరిస్తుందో వేచి చూడాలి!