‘బాహుబలి’ పవర్ఫుల్ డైలాగ్ ట్రైలర్..!

Baahubali-tamil

ఇప్పుడు దేశమంతా ‘బాహుబలి’ ఫీవర్ పట్టుకుందన్న విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి ది బిగినింగ్’ విడుదలకు దగ్గరవడంతో సినిమా యూనిట్ ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. సాంప్రదాయ ప్రెస్, మీడియా ప్రచారాలతో పాటు సోషల్ మీడియాలోనూ ప్రచార కార్యక్రమాలతో ‘బాహుబలి’ దూసుకుపోతోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రైలర్, పోస్టర్స్, సాంగ్స్ ఇలా అన్నీ విపరీతమైన స్పందనను తెచ్చుకున్న విషయం తెలిసిందే!

ఇక సోషల్ మీడియా ప్రమోషన్లలో భాగంగా తాజాగా విడుదలైన ‘మమతల తల్లి’, ‘నిప్పులే శ్వాసగా’ వీడియో సాంగ్స్ ఇప్పటికే హల్‌చల్ చేస్తుండగా, ఈ ఉదయం బాహుబలి కొత్త డైలాగ్ టీజర్‌ను విడుదల చేశారు. ఇప్పటివరకూ చూసిన విజువల్స్ స్థాయిలోనే ఈ ట్రైలర్ విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయనే చెప్పాలి. ఇక ‘చచ్చేలోగా ఒక్కసారైనా చూడాలని నువ్వు, ఇంకొకసారి కసితీరా ఈ చేతుల్తో చంపాలని నేనూ..’ అని రానా చెప్పే డైలాగ్; ‘మాహిష్మతి ఊపిరి పీల్చుకో.. బాహుబలి తిరిగొచ్చాడు!’ అంటూ అనుష్క చెప్పే డైలాగ్ వచ్చేప్పుడు థియేటర్ ఈలలతో మారు మోగిపోతుందన్న విషయం ఇప్పట్నుంచే స్పష్టమవుతోంది. ప్రభాస్, రానా, అనుష్క తమన్నాలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగు, తమిళ, మళయాల, హిందీ భాషల్లో జూలై 10న భారీ ఎత్తున బాహుబలి విడుదల కానున్న విషయం తెలిసిందే!

‘బాహుబలి’ డైలాగ్ ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version