1 బిలియన్ క్లబ్ లో చేరిన ‘బాహుబలి’

baahubali-b

ఇండియన్ ఫస్ట్ బిగ్ బడ్జెట్ ఫిల్మ్ అండ్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ ‘బాహుబలి’. జూలై 10న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షో నుంచే అన్ని ఏరియాల నుంచి రికార్డ్స్ సృష్టిస్తోంది. భాష, ప్లేస్ తో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాల నుంచి ఈ సినిమా రికార్డ్స్ బద్దలు కొడుతోంది. కేవలం మొదటి రెండు రోజుల్లోనే 1 బిలియన్(100కోట్ల) మార్క్ ని క్రాస్ చేసింది. మొదటి రోజే అన్ని భాషల్లో కలుపుకొని సుమారు 70 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన బాహుబలి రెండవ రోజు కూడా స్ట్రాంగ్ కలెక్షన్స్ సాధించింది. మొదటి రెండు రోజుల్లో 110 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది.

తెలుగు నుంచి 100 కోట్ల మార్క్ క్రాస్ చేసిన రెండవ సినిమా ఇది. గతంలో రాజమౌళి తీసిన మగధీర సినిమా అన్ని భాషల్లో కలిపి 150 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. మరో రెండు రోజుల్లో మగధీర లైఫ్ టైం కలెక్షన్స్ ని బ్రేక్ చేసేస్తుంది. అంతే కాకుండా ఇండియన్ వైడ్ గా హిట్ అయిన ఐ, రోబో, చెన్నై ఎక్స్ ప్రెస్, ధూమ్ 3 లాంటి సినిమాల రికార్డ్స్ ని బద్దలు కొడుతుందని అంటున్నారు. అలాగే ఓవరాల్ గా 250కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే తెలుగులో లైఫ్ టైంలో అత్యధిక గ్రాస్ కలెక్ట్ చేసిన పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమా రికార్డ్ ని ఆదివారం లేదా సోమవారంలోపు బ్రేక్ చేసేస్తుందని అంటున్నారు.

మేము రెగ్యులర్ గా అన్ని ఏరియాలకి చెందిన డిస్ట్రిబ్యూటర్స్ తో కాంటాక్ట్ లో ఉన్నాం, వారి దగ్గర నుంచి కచ్చితమైన కలెక్షన్స్ ని మీకు అందిస్తున్నాం. సో ఫ్రెండ్స్ బాహుబలి ప్రత్యేక మరియు కచ్చితమైన కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం 123తెలుగు.కామ్ ని విజిట్ చేస్తూ ఉండండి.

Exit mobile version