నైజాంలో 20 కోట్ల మార్క్ దిశగా ‘బాహుబలి’

Baahubali-still
హాలీవుడ్ కి మేము ఏ మాత్రం తక్కువ కాదంటూ తెలుగు సినిమా స్థాయిని ఇంటర్నేషనల్ సినిమాకి పరిచయం చేసిన గ్రాఫికల్ విజువల్ వండర్ ‘బాహుబలి’. గత గురు వారం వరకూ ఎంతగానో ఊరించి వచ్చిన ఈ సినిమా శుక్రవారం నుంచి కలెక్షన్స్ పరంగా రికార్డ్స్ బ్రేక్ చేస్తోంది. బాహుబలి సినిమా చిన్న టౌన్ నుంచి ఓవర్సీస్ దాకా అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేస్తోంది. ఇప్పటికే పలు ఏరియాల్లో ఫస్ట్ వీకెండ్ లో ఆల్ టైం రికార్డ్స్ ని క్రియేట్ చేస్తోంది.

నైజాంలో ఇప్పటివరకూ సూపర్ హిట్ సినిమాలు ఫుల్ రన్ లో సాధించిన రికార్డ్స్ ని బ్రేక్ చేసే దిశగా దూసుకుపోతోంది. వీక్ డే అయిన సోమవారం కూడా నైజాంలో బాహుబలికి స్ట్రాంగ్ కలెక్షన్స్ వచ్చాయి. నాల్గవ రోజు బాహుబలి నైజాంలో 2.82 కోట్ల షేర్ సాధించింది. అలాగే మొదటి వారం పూర్తయ్యేలోపు 21 నుంచి 22 కోట్ల షేర్ ని సాధిస్తుందని నైజాం డిస్ట్రిబూటర్స్ చెబుతున్నారు. నైజాంలో 20 కోట్ల మార్క్ క్రాస్ చెయ్యడం ఆల్ టైం రికార్డ్ అని చెప్పాలి. మొదటి వారమే ఇలా ఉంటే టోటల్ రన్ లో ఎవ్వరూ బ్రేక్ చెయ్యలేని రికార్డ్ నెంబర్ ని కలెక్ట్ చేస్తుందని అంటున్నారు. నైజాం ఏరియా మొదటి నాలుగు రోజుల షేర్ వివరాలు..

 

వారం కలెక్షన్స్ (షేర్)
శుక్ర వారం
 6.22 కోట్లు
శని వారం 3.55 కోట్లు
ఆది వారం 3.65 కోట్లు
సోమవారం 2.82 కోట్లు
మొత్తం 16.24 కోట్లు
Exit mobile version